Indian Railway: భారత్‌లోని ఆ ట్రాక్ ఇప్పటికీ బ్రిటిషర్లదే.. అద్దె కడుతున్న రైల్వేశాఖ
ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటైన ఇండియన్ రైల్వేస్‌కు.. తాను అద్దె కట్టే ఓ రైల్వే లైన్ ఉంది. ఈ లైన్‌పై రైలును నడిపినందుకు ఇప్పటికీ బ్రిటిషర్లకు రూ.కోటి కడుతోంది భారతీయ రైల్వే.
ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటైన ఇండియన్ రైల్వేస్‌కు.. తాను అద్దె కట్టే ఓ రైల్వే లైన్ ఉంది. ఈ లైన్‌పై రైలును నడిపినందుకు ఇప్పటికీ బ్రిటిషర్లకు రూ.కోటి కడుతోంది భారతీయ రైల్వే. మహారాష్ట్రలోని యావత్మాల్-ముర్తిజాపుర్ మధ్య ఉన్న రైల్వే లైన్‌ను బ్రిటిష్ పాలకులు నిర్మించారు. వారు దేశం విడిచి వెళ్లినా ఆ లైన్ ఇంకా వారి ఆధీనంలోనే ఉంది. 1952లో రైల్వేల జాతీయీకరణ సమయంలో ఈ లైన్‌ను మరిచిపోయారు అధికారులు. ఫలితంగా ఆనాటి నుంచీ బ్రిటిషర్లకు రూ.కోటి కడుతోంది భారతీయ రైల్వే.
ప్రస్తుతం ఈ రైల్వే లైన్ అమరావతి జిల్లాలోని నిరుపేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. 20 గంటలపాటు సాగే ఈ ప్రయాణానికి రూ.150 టికెట్ ధరగా పెట్టింది రైల్వే. సిగ్నలింగ్, టికెట్ల విక్రయం, క్యారేజీల నుంచి ఇంజిన్ వేరు చేసేందుకు ఈ లైన్‌లో ప్రస్తుతం ఏడుగురు సిబ్బంది పని చేస్తున్నారు. నారో గేజ్‌గా ఉన్న యావత్మాల్- ముర్తిజాపుర్ రైల్వే మార్గాన్ని బ్రాడ్ గేజ్‌గా మార్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందుకోసం అప్పటి రైల్వే మంత్రి సురేశ్ ప్రభు రూ.1,500 కోట్లను కేటాయించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Kurnool: భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు చేసిన భార్య
-
Sports News
Dhoni - CSK: ‘ఇంపాక్ట్ ప్లేయర్ రూల్’ ధోనీకి వర్తించదట.. కారణం చెప్పిన సెహ్వాగ్!
-
India News
IAF: వాయుసేన అపాచీ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
-
Sports News
Sachin - Gill: గిల్లో ఆ లక్షణాలు నన్ను ఆకట్టుకున్నాయి: సచిన్
-
Movies News
Adipurush: ‘ఆదిపురుష్’.. వాళ్లు కచ్చితంగా చూడాల్సిన చిత్రం: కృతి సనన్
-
World News
China: రేపు అంతరిక్షంలోకి పౌర వ్యోమగామి.. ఏర్పాట్లు సర్వం సిద్ధం..!