Satish Kaushik: బాలీవుడ్‌ నటుడు సతీశ్‌ కౌశిక్‌ మరణంపై అనుమానాలు

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సతీశ్‌ కౌశిక్‌ మరణంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ నెల 8న రాత్రి దిల్లీలోని ఓ ఫాంహౌస్‌లో హోలీ వేడుకలు జరుపుకొన్న ఆయన అర్ధరాత్రి దాటిన తర్వాత ఆనారోగ్యానికి గురై మరణించిన సంగతి తెలిసిందే.

Updated : 13 Mar 2023 07:43 IST

ఆయనతో నా భర్తకు ఆర్థిక వివాదాలున్నాయి
పోలీసులకు ఫాంహౌస్‌ యజమాని భార్య ఫిర్యాదు

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సతీశ్‌ కౌశిక్‌ మరణంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ నెల 8న రాత్రి దిల్లీలోని ఓ ఫాంహౌస్‌లో హోలీ వేడుకలు జరుపుకొన్న ఆయన అర్ధరాత్రి దాటిన తర్వాత ఆనారోగ్యానికి గురై మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫాంహౌస్‌ యజమాని వికాస్‌ మాలు రెండో భార్య సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తకు, సతీశ్‌ కౌశిక్‌కు డబ్బు విషయంలో గొడవ జరిగిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సతీశ్‌ మరణంపై అనుమానం వచ్చి దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ‘‘సతీశ్‌కు, నా భర్తకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి. గతంలో ఇచ్చిన రూ.15 కోట్లు తిరిగివ్వాలని నా భర్తను సతీశ్‌ కౌశిక్‌ గత ఆగస్టులో విదేశాల్లో అడిగారు. భారత్‌కు వచ్చిన తర్వాత ఇస్తానని నా భర్త చెప్పారు. సతీశ్‌ నుంచి తీసుకున్న డబ్బు కరోనా సమయంలో నష్టాల వల్ల పోగొట్టుకున్నానని నా భర్త నాతో చెప్పారు. వయాగ్రా ఔషధాలు, రష్యన్‌ అమ్మాయిలను ఉపయోగించి కౌశిక్‌ సమస్యను పరిష్కరించుకుంటానని నాతో అన్నారు. ఈ విషయాలన్నీ దిల్లీ పోలీసులకు తెలిపాను’’ అని వికాస్‌ భార్య చెప్పారు. ఈ ఆరోపణలపై విచారణ చేస్తున్నట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని