Currency: వెబ్‌ సిరీస్‌ సీన్‌ను తలపించేలా.. కారులోంచి కరెన్సీ విసిరేసిన యువకులు

ఇటీవల విడుదలైన ఓ బాలీవుడ్‌ వెబ్‌ సీరిస్‌లోని సన్నివేశాన్ని తలపించేలా ఇద్దరు యువకులు కారులోంచి కరెన్సీ నోట్లు విసిరిన ఘటన హరియాణాలోని గురుగ్రామ్‌లో కలకలం రేపింది.

Updated : 15 Mar 2023 07:16 IST

చండీగఢ్‌: ఇటీవల విడుదలైన ఓ బాలీవుడ్‌ వెబ్‌ సీరిస్‌లోని సన్నివేశాన్ని తలపించేలా ఇద్దరు యువకులు కారులోంచి కరెన్సీ నోట్లు విసిరిన ఘటన హరియాణాలోని గురుగ్రామ్‌లో కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రంగంలోకి దిగిన పోలీసు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గురుగ్రామ్‌లోని గోల్ఫ్‌ కోర్స్‌ రోడ్డులో ఇద్దరు యువకులు కారులో ప్రయాణించారు. ఈ క్రమంలోనే ఒకరు వాహనం నడుపుతుండగా.. మరొకరు కారు వెనుకభాగం నుంచి రోడ్లపై కరెన్సీ నోట్లు విసిరాడు. అతడు ముఖానికి కర్చీఫ్‌ కప్పుకొని కనిపించాడు. అవి అసలు నోట్లా..? నకిలీవా తెలియరాలేదు. దిల్లీకి చెందిన ఓ యూట్యూబర్‌ ఈ పని చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ‘ఫర్జీ’ వెబ్‌ సీరిస్‌లోని ఓ సన్నివేశంలోనూ.. ఇద్దరు కారులోంచి నకిలీ కరెన్సీ నోట్లను రహదారిపైకి విసురుతూ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యత్నిస్తారు. ఇదేవిధంగా ఆ దృశ్యాన్ని అనుకరించే యత్నంలో ఈ ఇద్దరు పోలీసులకు చిక్కారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు