Tamil Nadu: యజమాని మృతి చెందినా.. 3 నెలలుగా ఆసుపత్రిలో పెంపుడు శునకం ఎదురుచూపు
చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన యజమాని పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. కానీ, ఆయన అక్కడే ఉన్నారని భావించి మూడు నెలలుగా పెంపుడు శునకం నిరీక్షిస్తున్న ఘటన చూపరులను కంటతడి పెట్టిస్తోంది.
సేలం, న్యూస్‌టుడే: చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన యజమాని పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. కానీ, ఆయన అక్కడే ఉన్నారని భావించి మూడు నెలలుగా పెంపుడు శునకం నిరీక్షిస్తున్న ఘటన చూపరులను కంటతడి పెట్టిస్తోంది. తమిళనాడులోని సేలంలో ఉన్న మోహన్ కుమార మంగళం ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు నెలల క్రితం ఓ వ్యక్తి గుండెపోటు కారణంగా చికిత్స కోసం చేరారు. ఆయన పెంపుడు శునకం కూడా అక్కడికి వచ్చింది. రోగి చికిత్స పొందుతూ మృతి చెందారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. యజమాని లోపలే ఉన్నారని భావించిన శునకం మూడు నెలలుగా ఆయన రాక కోసం ఎదురుచూస్తోంది. విధుల్లో ఉన్న సిబ్బంది అక్కడి నుంచి పంపేసినా మళ్లీ వస్తోంది. దీంతో ఆసుపత్రి సిబ్బందే ఆహారం అందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం
-
Vijay antony: కుమార్తె మృతి.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ పోస్ట్
-
Sai Rajesh: నా సాయం పొందిన వ్యక్తే నన్ను తిట్టాడు: ‘బేబీ’ దర్శకుడు
-
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే.. ఈ రికార్డులు నమోదవుతాయా?
-
Military Tank: సైనిక శిక్షణ కేంద్రంలో మాయమై.. తుక్కులో తేలి!
-
NTR: ‘ఏఐ’ మాయ.. ఎన్టీఆర్‌ని తలపించేలా.. ఫొటో వైరల్