Marriage: మద్యం మత్తులో మండపానికి వెళ్లడం మర్చిపోయిన వరుడు
ఏకంగా తన పెళ్లి విషయాన్నే మర్చిపోయాడు ఓ వరుడు! ముహూర్త సమయానికి వివాహ మండపానికి వెళ్లకుండా ఆలస్యంగా వెళ్లాడు.
ఏకంగా తన పెళ్లి విషయాన్నే మర్చిపోయాడు ఓ వరుడు! ముహూర్త సమయానికి వివాహ మండపానికి వెళ్లకుండా ఆలస్యంగా వెళ్లాడు. అదీ మద్యం తాగి వచ్చాడు. దీంతో వరుడి కోసం మండపంలో ఎదురు చూసిన వధువు ఏకంగా పెళ్లినే రద్దు చేసుకుంది. బిహార్ భాగల్‌పూర్ ప్రాంతానికి చెందిన మియాన్ అనే యువకుడికి సుల్తాన్‌గంజ్ గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు. మంగళవారం ఉదయం ముహూర్తాన్ని ఖరారు చేశారు. వివాహ మండపానికి చేరుకున్న వధువు వరుడి రాకకోసం ఎదురు చూసింది. ముహూర్త సమయం దాటినా పెళ్లి కుమారుడు రాకపోయేసరికి వధువు కుటుంబీకులు ఆందోళన చెందారు. అతడు మధ్యాహ్నం సమయంలో మద్యం సేవించి పెళ్లి మండపానికి వచ్చాడు. ఇది గమనించిన ఆ వధువు నాకీ పెళ్లి వద్దంటూ తిరస్కరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
FootBall in Asian Games: ఇలాగైతే మమ్మల్ని ఎక్కడికీ పంపొద్దు: భారత ఫుట్‌బాల్ కోచ్ ఆవేదన
-
Amazon Festival Sale: అమెజాన్ పండగ సేల్‌లో TVలపై ఆఫర్లివే..
-
Afghan embassy in India: భారత్‌లో అఫ్గాన్ ఎంబసీని మూసేస్తున్నారా? కేంద్రానికి మెసేజ్..!
-
Elon Musk: వలసదారులకు నేను అనుకూలం : ఎలాన్ మస్క్
-
TDP: సొంత భూమే పోగొట్టుకున్నా.. నేను అవినీతి చేస్తానా?: మాజీ మంత్రి నారాయణ