Bihar: బెయిల్‌ కోసం కోర్టుకు నాలుగేళ్ల బాలుడు

నాలుగేళ్ల బాలుడు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించిన ఘటన బిహార్‌లోని బెగుసరాయ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. 2021 ఏప్రిల్‌లో రెండేళ్ల వయసున్న ఆ బాలుడు.

Updated : 18 Mar 2023 07:22 IST

నాలుగేళ్ల బాలుడు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించిన ఘటన బిహార్‌లోని బెగుసరాయ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. 2021 ఏప్రిల్‌లో రెండేళ్ల వయసున్న ఆ బాలుడు సహా 8 మంది కంటైన్‌మెంట్‌ ప్రాంతంలో పెట్టిన బారికేడ్లు తొలగించడం ద్వారా కొవిడ్‌ వ్యాప్తికి కారణమయ్యారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ బాలుడి తల్లికి ఈ కేసు విషయం గురువారమే తెలిసింది. దీంతో బెయిల్‌ కోసం తన కుమారుణ్ని వెంటబెట్టుకుని కోర్టుకు వచ్చింది. ఈ కేసును విచారించిన బెగుసరాయ్‌ కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. చిన్నారిపై ఇలాంటి కేసు పెట్టడానికి, బెయిల్‌ ఇవ్వడానికి ఎటువంటి నిబంధనలు లేవని తెలిపింది. బాలుడిపై కేసు కొట్టివేయాలని పోలీసులను ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని