Liquor: మందుబాబులకు రూ.100 కోట్ల ‘ఆవు సుంకం’!

మద్యం అమ్మకాలపై ఆవు సుంకం (కౌ సెస్‌) విధిస్తున్నట్లు హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్విందర్‌సింగ్‌ సుఖు ప్రకటించారు. ప్రతి మద్యం సీసాపై అదనంగా రూ.10 చొప్పున వసూలు చేస్తామని వెల్లడించారు.

Updated : 18 Mar 2023 09:51 IST

ద్యం అమ్మకాలపై ఆవు సుంకం (కౌ సెస్‌) విధిస్తున్నట్లు హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్విందర్‌సింగ్‌ సుఖు ప్రకటించారు. ప్రతి మద్యం సీసాపై అదనంగా రూ.10 చొప్పున వసూలు చేస్తామని వెల్లడించారు. దీని ద్వారా ఏడాదికి రూ.100 కోట్లు ప్రభుత్వ ఖజానాకు వస్తాయని, ఆ ఆదాయాన్ని గోవుల సంరక్షణకు ఉపయోగిస్తామన్నారు. పర్యాటక విడిదిగా ఉన్న రాష్ట్రంలో మందుబాబులకు ఇది షాక్‌ అని చెప్పవచ్చు. హిమాచల్‌ అసెంబ్లీలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.53,413 కోట్ల బడ్జెట్‌ను సీఎం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులపై వరాల జల్లు కురిపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 20 వేలమంది బాలికలకు ఎలక్ట్రిక్‌ స్కూటీల కొనుగోలు నిమిత్తం ఒక్కొక్కరికి రూ.25,000 రాయితీ అందిస్తామని ప్రకటించారు. 2,31,000 మంది మహిళలకు సామాజిక భద్రతా పింఛను కింద ప్రతినెలా రూ.1,500 నగదు అందిస్తామని సుఖ్విందర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని