మెట్టినిల్లు దూరంగా ఉంది.. పుట్టింటికి వెళ్తా.. వివాహమైన ఏడు గంటల్లోనే వధువు నిర్ణయం

వివాహం జరిగిన ఏడు గంటల్లోనే ఓ నవవధువు అనూహ్య నిర్ణయం తీసుకుంది. అత్తవారిల్లు దూరంగా ఉందని అక్కడికి వెళ్లేందుకు నిరాకరించింది.

Updated : 19 Mar 2023 10:51 IST

వివాహం జరిగిన ఏడు గంటల్లోనే ఓ నవవధువు అనూహ్య నిర్ణయం తీసుకుంది. అత్తవారిల్లు దూరంగా ఉందని అక్కడికి వెళ్లేందుకు నిరాకరించింది. కారులో బయల్దేరి వెళ్తుండగా మధ్యలోనే ఆగి.. ఇంటికి పయనమైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది.  ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి చెందిన యువతికి.. రాజస్థాన్‌కు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. అనంతరం ఇద్దరికి ఘనంగా పెళ్లి చేశారు. అప్పగింతలు అయిపోయాక మెట్టినింటికి బయలుదేరింది వధువు.

ఇంతలో ఏమైందో ఏమో ఒక్కసారిగా.. మనసు మార్చుకుంది. ‘అత్తవారిల్లు చాలా దూరం.. నాకు రాజస్థాన్‌ వెళ్లాలని లేదు.. నేను వారణాసి వెళ్లిపోతా’ అంటూ ఏడవడం మొదలు పెట్టింది. కారు ఆపాలంటూ గట్టిగా అరిచింది.  దీంతో రోడ్డు పక్కన పెళ్లి వాహనాలు ఆగిపోయాయి. ఆదే సమయంలో ఆ ప్రాంతంలో వధువు ఏడుస్తూ ఉండటాన్ని చూసిన పోలీస్‌ రెస్పాన్స్‌ వాహనంలోని సిబ్బంది.. మహరాజ్‌పుర్‌ పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని.. వారిని వివరాలు అడిగారు. తాము అమ్మాయికి పెళ్లి చేశామని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. వారణాసి వెళ్తానని వధువు పోలీసులకు చెప్పింది. దీంతో ఆమెను మహిళా పోలీసు సహాయంతో అక్కడకు పంపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు