అల్సర్‌ మందుతో క్యాన్సర్‌ రాదు

కడుపులో అల్సర్ల నివారణకు, చికిత్సకు వాడే రానిటిడిన్‌ మందును వాడటం క్యాన్సర్‌కు దారితీస్తుందనే భావన తప్పు అని నిరూపితమైంది.

Published : 19 Mar 2023 03:33 IST

దిల్లీ: కడుపులో అల్సర్ల నివారణకు, చికిత్సకు వాడే రానిటిడిన్‌ మందును వాడటం క్యాన్సర్‌కు దారితీస్తుందనే భావన తప్పు అని నిరూపితమైంది. దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. రానిటిడిన్‌ను అజీర్తి, పొట్టలో గ్యాస్‌ ఏర్పడకుండా నిరోధించడానికి వాడుతున్నారు. ఈ మందు వల్ల క్యాన్సర్‌ వస్తుందా లేదా అనేదానిపై మూడేళ్ల నుంచి చర్చ జరుగుతోంది. 2019లో పలు రానిటిడిన్‌ మాత్రలలో క్యాన్సర్‌ను కలిగించగల ఎన్‌డీఎంఏ మాలిన్యాలు ఉన్నట్లు తేలి, వాటిని మార్కెట్‌ నుంచి ఉపసంహరించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దాంతో ఈ మందుపై దక్షిణ కొరియాలో పరిశోధన జరిగింది. ఇందులో 12,680 మంది రానిటిడిన్‌ వినియోగదారులు, ఆ మందును పోలిన హెచ్‌2ఆర్‌ఏ ఔషధాలను వాడిన మరో 12,680 మందిపైన అధ్యయనం జరిపారు. రానిటిడిన్‌కు, క్యాన్సర్‌కు మధ్య సంబంధమే లేదని తేల్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు