వీడనున్న ‘వాసన’ గుట్టు!

ఆఘ్రాణ (వాసన) శక్తి గుట్టును విప్పే దిశగా అమెరికాలోని కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు.

Published : 19 Mar 2023 03:33 IST

దిల్లీ: ఆఘ్రాణ (వాసన) శక్తి గుట్టును విప్పే దిశగా అమెరికాలోని కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. మానవుల్లోని ఒక రిసెప్టర్‌ క్రియాశీలమవుతున్న తీరుకు సంబంధించిన త్రీడీ చిత్రాన్ని వారు ఆవిష్కరించారు. ఆహార పదార్థాల నుంచి వెలువడే వాసనలను ఆఘ్రాణించి అవి రుచికరంగా ఉంటాయో లేదో ముక్కు అంచనా వేస్తుంది. నాసికలోనూ, దేహంలోని ఇతర అవయవాల్లోనూ ఉండే 400 గ్రాహకాలు వాసన శక్తిని ఇస్తాయి. ఉదాహరణకు స్విస్‌ చీజ్‌ నుంచి ఘాటైన వాసన వెలువడటానికి కారణమైన ప్రోపియనేట్‌ అనే మాలిక్యూల్‌ను పసిగట్టడానికి ఓఆర్‌ 51ఇ2 అనే రిసెప్టర్‌ తోడ్పడుతుంది. క్రయో ఎలక్టాన్రిక్‌ మైక్రోస్కోపీ ప్రక్రియతో శాస్త్రవేత్తలు దీని త్రీడీ చిత్రాన్ని తీశారు. సాధారణంగా ఒక్క మిల్లీగ్రాము ఓఆర్‌ 51ఇ2 ప్రోటీన్‌ లభ్యమైతే కానీ దాని పరమాణు చిత్రాన్ని తీయలేము. కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు మిల్లీగ్రాములో నూరో వంతుతోనే ఈ ఘనతను సాధించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు