చనిపోయే ముందు.. రూ.2 కోట్ల విరాళం!

ఆమె తల్లి.. తండ్రి.. తోబుట్టువులు అందరూ ఒకరి తర్వాత మరొకరు కేన్సర్‌ మహమ్మారి బారినపడి మరణించారు. తమిళనాడులోని ఆవడి కామరాజ్‌ పట్టణానికి చెందిన సుందరీబాయ్‌ ఒంటరిగా మిగిలారు.

Published : 19 Mar 2023 05:25 IST

కాంచీపురం కేన్సర్‌ ఆస్పత్రికి ఇవ్వాలని మహిళ లేఖ

తిరువళ్లూర్‌: ఆమె తల్లి.. తండ్రి.. తోబుట్టువులు అందరూ ఒకరి తర్వాత మరొకరు కేన్సర్‌ మహమ్మారి బారినపడి మరణించారు. తమిళనాడులోని ఆవడి కామరాజ్‌ పట్టణానికి చెందిన సుందరీబాయ్‌ ఒంటరిగా మిగిలారు. గత ఫిబ్రవరి నెల 17న ఈమె కూడా మరణించారు. చనిపోయే ముందు అధికారులను ఉద్దేశించి ఓ లేఖ రాసిన సుందరీబాయ్‌ తన పేరిట ఉన్న దాదాపు రూ.2 కోట్ల ఆస్తులను కాంచీపురం అరిజార్‌ అన్నా కేన్సర్‌ సెంటర్‌కు అందించాలని కోరారు. ‘‘నా ఇల్లు, 54 సవర్ల బంగారం, బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.61 లక్షలు అన్నా కేన్సర్‌ సెంటర్‌కు అందజేయండి. అందులోంచి కొంత మొత్తం మా ఎదురింటివాళ్లకు, ఆటోడ్రైవర్‌కు ఇచ్చి నా బాకీ తీర్చండి. నేను ఇంట్లో పెంచుకొంటున్న పిల్లులు పదికి పైగా ఉంటాయి. దయచేసి వాటిని కాపాడండి’’ అని సుందరీబాయ్‌ లేఖ ముగించారు. ఆమె కోరిక మేరకు ఆయా ఆస్తులను సీజ్‌ చేసిన స్థానిక అధికారులు శనివారం వాటి డాక్యుమెంట్లను జిల్లా డిప్యూటీ కలెక్టర్‌కు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని