Ration ATMs: యూపీలో ‘అన్న్‌పూర్తి’ ధాన్యం ఏటీఎంలు

ప్రతినెలా రేషను సరకుల కోసం దుకాణాల ముందు చాంతాడంత క్యూ లైన్లలో నిలబడటం ఇకపై గతకాలపు మాట.

Updated : 19 Mar 2023 07:51 IST

లఖ్‌నవూ: ప్రతినెలా రేషను సరకుల కోసం దుకాణాల ముందు చాంతాడంత క్యూ లైన్లలో నిలబడటం ఇకపై గతకాలపు మాట. రేషన్‌కార్డు ఉన్న వినియోగదారులు కేవలం 30 సెకన్ల వ్యవధిలో బియ్యం, గోధుమలు తీసుకునేలా ఇపుడు ‘అన్న్‌పూర్తి’ ధాన్యం ఏటీఎంలు వచ్చేశాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా మూడు ధాన్యం ఏటీఎంలను ప్రభుత్వం ప్రారంభించింది. మార్చి 15న లఖ్‌నవూ సమీప జానకీపురంలో తొలి ఏటీఎం సిద్ధమైంది. దాదాపు 150 మంది వినియోగదారులకు ఇది సేవలందిస్తోంది. దీంతోపాటు మరో రెండు ఏటీఎంలు కూడా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. వినియోగదారు ఈ యంత్రం మీద వేలిముద్ర వేయగానే 3 కేజీల బియ్యం, 2 కేజీల గోధుమలు వస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని