పాక్‌ నుంచి భారత్‌లోకి చిరుత

పాకిస్థాన్‌ సరిహద్దుల నుంచి ఓ చిరుత పులి భారత్‌లోకి చొరబడటం కలకలం రేపుతోంది.

Published : 20 Mar 2023 04:10 IST

పాకిస్థాన్‌ సరిహద్దుల నుంచి ఓ చిరుత పులి భారత్‌లోకి చొరబడటం కలకలం రేపుతోంది. జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు నుంచి ఇది ప్రవేశించినట్టు పోలీసులు వెల్లడించారు. బీఎస్‌ఎఫ్‌ బోర్డర్‌ అవుట్‌ పోస్ట్‌ నర్సరీకి సమీపంలో ఉన్న ఫెన్సింగ్‌ను దాటి ఓ చిరుత భారత్‌లోకి ప్రవేశించడం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. బీఎస్‌ఎఫ్‌ నుంచి సమాచారం అందడంతో అన్ని బోర్డర్‌ పోలీస్‌ పోస్టులను అప్రమత్తం చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా ప్రాంతాల్లోని స్థానికులకు సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు