ఒక్క రోజే 1,071 కొవిడ్‌ కేసులు.. దేశంలో మళ్లీ పెరుగుదల

దేశంలో కొవిడ్‌ కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా ఒక్కరోజులోనే 1000కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.

Updated : 20 Mar 2023 04:52 IST

దిల్లీ: దేశంలో కొవిడ్‌ కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా ఒక్కరోజులోనే 1000కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితి 129 రోజుల తరువాత ఇదే తొలిసారి. మొత్తం మీద 5,915 కేసులు క్రియాశీలంగా ఉన్నాయి. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. అందులో గడచిన 24 గంటల్లో 1,071 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయని పేర్కొంది. తాజాగా రాజస్థాన్‌, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరు చొప్పున మరణించడంతో మృతుల సంఖ్య 5,30,802కు చేరింది. ఝార్ఖండ్‌లో రెండు హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లూయెంజా, అయిదు కరోనా కేసులు నమోదయినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని