నేడు దిల్లీకి లక్షల మంది రైతులు

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి తరలిరానున్న లక్షల మంది రైతులతో దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సోమవారం ‘కిసాన్‌ మహా పంచాయత్‌’ నిర్వహించనున్నట్లు సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) నేతలు ఆదివారం వెల్లడించారు.

Published : 20 Mar 2023 04:10 IST

కిసాన్‌ మహా పంచాయత్‌ నిర్వహిస్తాం: ఎస్‌కేఎం

దిల్లీ: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి తరలిరానున్న లక్షల మంది రైతులతో దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సోమవారం ‘కిసాన్‌ మహా పంచాయత్‌’ నిర్వహించనున్నట్లు సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) నేతలు ఆదివారం వెల్లడించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న ప్రధాన డిమాండుతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పలు రైతు సంఘాల సమాఖ్యగా ఏర్పడిన ఎస్‌కేఎం ఇప్పటికే ప్రకటించింది. కిసాన్‌ మోర్చా నేత దర్శన్‌ పాల్‌ మీడియాతో మట్లాడుతూ..‘‘2021 డిసెంబర్‌ 9న కేంద్ర ప్రభుత్వం మాకు లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలి. అలాగే రైతులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యల పరిష్కారానికి సమర్థ చర్యలు తీసుకోవాలి’’ అని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని