కుక్కను బండికి కట్టి ఈడ్చుకెళ్లాడు..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌ జిల్లాలో శనివారం ఇస్మాయిల్‌ అనే వ్యక్తి కుక్కను మోటార్‌ సైకిలుకు కట్టి కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లాడు.

Published : 20 Mar 2023 04:57 IST

(ఈటీవీ భారత్‌)

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌ జిల్లాలో శనివారం ఇస్మాయిల్‌ అనే వ్యక్తి కుక్కను మోటార్‌ సైకిలుకు కట్టి కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. విజయ్‌నగర్‌ పోలీస్‌స్టేషను పరిధిలోని ప్రతాప్‌ విహార్‌ ఔట్‌పోస్టు వద్దకు రాగానే.. ఈ అమానుషాన్ని స్థానికులు గమనించారు. ద్విచక్ర వాహనాలతో వెంటపడి ఇస్మాయిల్‌ను ఆపారు. పీఎఫ్‌ఏ (పీపుల్స్‌ ఫర్‌ యానిమల్స్‌) సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్న నిందితుడిని పోలీసులకు అప్పగించారు. సభ్యుల పోలీసులు ఇస్మాయిల్‌ను అరెస్టు చేసి.. కేసు నమోదు చేశారు. ఆ కుక్క చాలామందిని కరిచిందని.. అందుకే దాన్ని పట్టుకొని దూరంగా వదిలేయడానికి తీసుకెళ్తున్నానని ఇస్మాయిల్‌ తెలిపాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు