సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపు ఈ-మెయిల్‌

‘‘గోల్డీ భాయ్‌ (గోల్డీ బ్రార్‌) నీతో ముఖాముఖి మాట్లాడాలనుకొంటున్నాడు’’ అంటూ ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఆఫీసుకు బెదిరింపు ఈ మెయిల్‌ వచ్చింది.

Published : 20 Mar 2023 04:57 IST

గ్యాంగ్‌స్టర్లపై ముంబయి పోలీసుల కేసు నమోదు

ముంబయి: ‘‘గోల్డీ భాయ్‌ (గోల్డీ బ్రార్‌) నీతో ముఖాముఖి మాట్లాడాలనుకొంటున్నాడు’’ అంటూ ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఆఫీసుకు బెదిరింపు ఈ మెయిల్‌ వచ్చింది. ఈ మేరకు బాంద్రా ఠాణాకు అందిన ఫిర్యాదుతో గ్యాంగ్‌స్టర్లు లారెన్స్‌ బిష్ణోయ్‌, గోల్డీ బ్రార్‌లతోపాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ముంబయి పోలీసు అధికారులు ఆదివారం వెల్లడించారు. బిష్ణోయ్‌ ప్రస్తుతం బఠిండా జైలు ఉండగా, పంజాబ్‌ గాయకుడు సిధు మూసేవాలా హత్యకేసులో గోల్డీబ్రార్‌ నిందితుడు. వచ్చేసారి ఓ కుదుపు ఉంటుంది (‘నెక్స్ట్‌ టైమ్‌ ఝట్కా దేఖ్‌నేకో మిలేగా’) అంటూ  ఈ-మెయిల్‌ చివర్లో పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు