రూ.2 కోట్ల విలువైన ఆస్తులు క్యాన్సర్‌ కేంద్రానికి దానం

తమిళనాడులో ఓ వృద్ధురాలు తన రూ.రెండు కోట్ల విలువైన ఆస్తులను కాంచీపురం అన్నా క్యాన్సర్‌ కేంద్రానికి అందజేయాలని అధికారులనుద్దేశించి లేఖ రాసి మరణించారు.

Published : 21 Mar 2023 04:09 IST

చనిపోయే ముందు లేఖ రాసిన వృద్ధురాలు

చెన్నై(ఆవడి), న్యూస్‌టుడే: తమిళనాడులో ఓ వృద్ధురాలు తన రూ.రెండు కోట్ల విలువైన ఆస్తులను కాంచీపురం అన్నా క్యాన్సర్‌ కేంద్రానికి అందజేయాలని అధికారులనుద్దేశించి లేఖ రాసి మరణించారు. తిరువళ్లూరు జిల్లా ఆవడిలోని కామరాజర్‌నగర్‌కు చెందిన సుందరీబాయ్‌(54) గత నెల 17న క్యాన్సర్‌తో ఇంట్లో మృతిచెందారు. పోలీసుల దర్యాప్తులో.. మృతురాలు, ఆమె చెల్లి జానకి మాత్రమే ఇంట్లో ఉండేవారని గుర్తించారు. సుందరీబాయ్‌ మృతి చెందిన మూడు రోజుల ముందే జానకి చనిపోయినట్లు తెలిసింది. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆమె ఇంట్లో పరిశీలించగా.. ఓ పెట్టెలో 54 సవర్ల బంగారు నగలు, బ్యాంకు ఖాతాలో రూ.61 లక్షల నగదు ఉన్నట్లు పాస్‌బుక్‌, ఇంటిపత్రాలు, ఓ లేఖ కనిపించాయి. రూ.రెండు కోట్లు విలువచేసే నగదు, బంగారాన్ని కాంచీపురం ‘అన్నా’ క్యాన్సర్‌ చికిత్సా కేంద్రానికి అందజేయాలని లేఖలో రాసి ఉంది. దీంతో ఆవడి పోలీసు కమిషనర్‌ సందీప్‌రాయ్‌ రాథోడ్‌ ఆదేశాలతో పోలీసులు వాటిని ఈనెల 18న రెవెన్యూ అధికారులకు అప్పగించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు