Property: ఏనుగుల కోసం రూ.5 కోట్ల ఆస్తి

బిహార్‌లోని జాన్‌పుర్‌కు చెందిన మహమ్మద్‌ అక్తర్‌ ఇమామ్‌ అనే వ్యక్తి రెండు ఏనుగుల పేరిట రూ.5 కోట్ల విలువైన ఆస్తిని రాసిచ్చాడు. ఇటీవల అనారోగ్యంతో ఓ ఏనుగు మరణించడంతో.. ‘రాణి’ అనే ఏనుగు యావదాస్తికి ఏకైక వారసురాలిగా కొనసాగుతోంది.

Updated : 21 Mar 2023 07:46 IST

బిహార్‌లోని జాన్‌పుర్‌కు చెందిన మహమ్మద్‌ అక్తర్‌ ఇమామ్‌ అనే వ్యక్తి రెండు ఏనుగుల పేరిట రూ.5 కోట్ల విలువైన ఆస్తిని రాసిచ్చాడు. ఇటీవల అనారోగ్యంతో ఓ ఏనుగు మరణించడంతో.. ‘రాణి’ అనే ఏనుగు యావదాస్తికి ఏకైక వారసురాలిగా కొనసాగుతోంది. అక్తర్‌ పెంచుకున్న రెండు ఏనుగులకు మోతి, రాణి అని పేర్లు పెట్టాడు. ఒక వేళ తాను చనిపోయినా వాటి మనుగడకు ఎలాంటి లోటు ఉండకూడదని భావించి తనకున్న రూ.5 కోట్ల విలువైన ఆస్తిని ఏనుగుల పేరు మీద వీలునామా రాశాడు. ఆయన అంతకు ముందే తన భార్య, పిల్లలతో విడిపోయాడు. అతడు తన ఆస్తిని ఏనుగులకు రాసివ్వడం కుటుంబీకులకు నచ్చలేదు. ఈ క్రమంలో 2021లో అక్తర్‌ హత్యకు గురయ్యాడు. అప్పటికే వీలునామా రాయడంతో ఆస్తి మొత్తం ఏనుగులకు దక్కింది.  ప్రస్తుతం రాణి ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌లో ఓ వ్యక్తి సంరక్షణలో ఉంటోంది. ఆస్తి పట్నాలో ఉంది. ఈ ఆస్తిని ఏనుగుకు సద్వినియోగం చేస్తేనే అక్తర్‌ ఆశయం నెరవేరుతుందని అటవీ అధికారులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని