కొవిడ్‌ చికిత్సలో యాంటీబయాటిక్స్‌ వద్దు

కొవిడ్‌-19 బాధితులకు చికిత్సలో భాగంగా యాంటీబయాటిక్స్‌ వాడొద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు పరీక్షల్లో తేలితే మాత్రమే వాటిని ఉపయోగించాలని నిర్దేశిస్తూ సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.

Published : 21 Mar 2023 05:13 IST

బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లు ఉంటేనే వాడాలి
మార్గదర్శకాలను సవరించిన కేంద్రం

దిల్లీ: కొవిడ్‌-19 బాధితులకు చికిత్సలో భాగంగా యాంటీబయాటిక్స్‌ వాడొద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు పరీక్షల్లో తేలితే మాత్రమే వాటిని ఉపయోగించాలని నిర్దేశిస్తూ సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. లోపినవిర్‌-రిటోనవిర్‌, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, ఐవర్‌మెక్టిన్‌, మోల్నుపిరవిర్‌, ఫావిపిరవిర్‌, అజిత్రోమైసిన్‌, డాక్సిసైక్లిన్‌ మందులను వాడొద్దంది. దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు ఆదివారం 1000, సోమవారం 918 నమోదయ్యాయి. మొత్తంగా క్రియాశీలక కేసులు 6,350 ఉన్నాయి. కొవిడ్‌-19పై ఎయిమ్స్‌/ఐసీఎంఆర్‌ ప్రతినిధులతో కూడిన జాతీయస్థాయి టాస్క్‌ఫోర్స్‌ జనవరి 5న సమావేశమైనప్పుడు ప్లాస్మా థెరపీని సైతం వద్దని వైద్యులకు సూచించింది. అయితే మధ్యస్థ, తీవ్ర కేసుల్లో మాత్రం  రెమిడెసివిర్‌ వాడొచ్చని, అది కూడా లక్షణాలు బహిర్గతమైన 10 రోజుల్లోనే ఉపయోగించాలని సూచించింది. ఆక్సిజన్‌ అవసరం లేకుండా, ఇంట్లోనే చికిత్స పొందుతున్నవారికి అయిదు రోజులకంటే అధికంగా చికిత్స అందించాల్సిన అవసరం ఉన్నట్లు భావించడంలేదంది. లక్షణాల తీవ్రత పెరిగి, ఐసీయూలో చేర్చాల్సి వస్తే మాత్రం టొసిలిజుమాబ్‌ మందును 24-48 గంటల్లో వాడొచ్చని కేంద్రం సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని