85 మీటర్ల కూలింగ్‌ టవర్‌.. ఏడు సెకన్లలో నేలమట్టం

గుజరాత్‌లోని సూరత్‌లో 85 మీటర్ల (దాదాపు 278 అడుగులు) ఎత్తున్న కూలింగ్‌ టవర్‌ను కేవలం 7 సెకన్లలో అధికారులు నేలమట్టం చేశారు.

Published : 22 Mar 2023 09:22 IST

గుజరాత్‌లోని సూరత్‌లో 85 మీటర్ల (దాదాపు 278 అడుగులు) ఎత్తున్న కూలింగ్‌ టవర్‌ను కేవలం 7 సెకన్లలో అధికారులు నేలమట్టం చేశారు. తపతీ నది తీరాన 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ టవర్‌ను కూల్చేందుకు 262.5 కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించారు. మంగళవారం ఉదయం 11.10 గంటలకు ప్రత్యేక జాగ్రత్తల నడుమ ఈ కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర విద్యుత్‌ కార్పొరేషన్‌ 135 మెగావాట్ల పవర్‌ ప్లాంటులో భాగంగా నిర్మించిన ఈ కూలింగ్‌ టవర్‌ను సాంకేతిక, వాణిజ్యపరమైన కారణాలతో కూల్చివేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు