కన్నతండ్రి దూరమైనా తరగని ప్రేమ.. భౌతికకాయం ముందే పెళ్లి చేసుకున్న కుమారుడు
కన్నతండ్రి కనుమూయడం ఆ కుమారుడికి తీరని వేదన మిగిల్చింది. అదీ తాను పెళ్లి చేసుకునే గడువు సమీపించిన సమయంలో శాశ్వతంగా దూరమవడంతో కన్నీరుమున్నీరయ్యాడు.
ప్యారిస్ (చెన్నై), న్యూస్‌టుడే: కన్నతండ్రి కనుమూయడం ఆ కుమారుడికి తీరని వేదన మిగిల్చింది. అదీ తాను పెళ్లి చేసుకునే గడువు సమీపించిన సమయంలో శాశ్వతంగా దూరమవడంతో కన్నీరుమున్నీరయ్యాడు. తన పెళ్లి చూడాలన్న తండ్రి కోరికను ఎలాగైనా తీర్చాలని తలపోశాడు. ఆయన భౌతికకాయం ముందే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడులోని కళ్లక్కురిచ్చిలో చోటుచేసుకుంది. కళ్లక్కురిచ్చి సమీపం పెరువంగూర్ గ్రామానికి చెందిన పంచాయతీ యూనియన్ అధ్యక్షురాలు అయ్యమ్మాళ్ భర్త రాజేంద్రన్ అనారోగ్యంతో సోమవారం చనిపోయారు. ఆయన కుమారుడు ప్రవీణ్‌కు 27వతేదీన పెళ్లి ఉంది. రాజేంద్రన్ అంత్యక్రియలకు చెన్నైకి చెందిన వధువు స్వర్ణమాల్య తన కుటుంబంతో సహా వచ్చారు. తండ్రి భౌతికకాయం సమక్షంలోనే పెళ్లి చేసుకుందామని ప్రవీణ్ కోరారు. ఆమె కూడా అంగీకరించడంతో ఇద్దరూ పెళ్లి దుస్తుల్లో అక్కడే పెళ్లి చేసుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పామును కొరికి చంపిన బాలుడు
-
India News
28 వేల మంది జమ్మూకశ్మీర్ ప్రభుత్వోద్యోగులపై ఐటీ శాఖ నిఘా
-
Ap-top-news News
శ్రీవారి ఆలయ సమీపంలో వెళ్లిన విమానం
-
Sports News
చిరునవ్వుతో టాటా.. పీఎస్జీని వీడిన మెస్సి
-
India News
అనాథకు.. తండ్రిని చూపిన అన్నదానం
-
Ts-top-news News
ప్రొటోకాల్ వివాదం.. శిలాఫలకాల తొలగింపు