తల్లిని పాము కరిచింది... బిడ్డ ప్రాణాల్ని నిలిపింది

ఓ మహిళను పాము కాటేయగా... ఆమెను కుమార్తె కాపాడిన ఉదంతమిది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా కెయ్యూరు గ్రామ శివార్లలోని ఎట్కెడ్య గ్రామంలో ఇంటి పెరడులో పని చేసుకుంటున్న గృహిణి మమతను ఆదివారం నాగుపాము కాటేసింది.

Published : 22 Mar 2023 05:17 IST

కర్ణాటకలో ఘటన

మంగళూరు, న్యూస్‌టుడే: ఓ మహిళను పాము కాటేయగా... ఆమెను కుమార్తె కాపాడిన ఉదంతమిది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా కెయ్యూరు గ్రామ శివార్లలోని ఎట్కెడ్య గ్రామంలో ఇంటి పెరడులో పని చేసుకుంటున్న గృహిణి మమతను ఆదివారం నాగుపాము కాటేసింది. ఆమె కేకలు వేస్తూ కిందపడిపోయారు. పక్కనే ఉన్న ఆమె కుమార్తె శ్రమ్య వేగంగా స్పందించింది. పాముకాటుకు గురైన తల్లి కాలికి కట్టు కట్టి, విషం శరీర భాగాలకు పాకకుండా చేసింది. ఆ తర్వాత విషంతో కూడిన రక్తాన్ని నోటితో పీల్చి ఉమ్మేసింది. ఇరుగుపొరుగు వారి సాయంతో తల్లిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లింది. సమయస్ఫూర్తితో తల్లి ప్రాణాల్ని కాపాడిన శ్రమ్యను స్థానికులు ప్రశంసించారు. ఈ విషయం తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని