గడ్కరీకి బెదిరింపు కాల్స్‌

కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకుడు నితిన్‌ గడ్కరీకి బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. ఆయన కార్యాలయానికి మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి 3 సార్లు కాల్‌ చేయడం తీవ్ర కలకలం రేపింది.

Published : 22 Mar 2023 05:17 IST

రూ.10 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని హెచ్చరిక

నాగ్‌పుర్‌: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకుడు నితిన్‌ గడ్కరీకి బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. ఆయన కార్యాలయానికి మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి 3 సార్లు కాల్‌ చేయడం తీవ్ర కలకలం రేపింది. రూ.10 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామని ఫోన్‌లో దుండగుడు హెచ్చరించాడు. అప్రమత్తమైన పోలీసులు.. నాగ్‌పుర్‌లోని గడ్కరీ ఇల్లు, కార్యాలయంవద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బెదిరింపు కాల్స్‌ చేసిన వ్యక్తి తనను తాను జయేశ్‌ పూజారిగా చెప్పాడని, నాగ్‌పుర్‌ రెండో జోన్‌ డిప్యూటీ పోలీసు కమిషనరు రాహు మాడనే వెల్లడించారు. జయేశ్‌ పూజారి ఓ మర్డర్‌ కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఖైదీ అని తెలిసింది. దీనిపై అతడిని విచారించగా.. తనకూ, బెదిరింపు కాల్స్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు