ఇంగ్లిష్‌ వినియోగంపై మండిపడ్డ బిహార్‌ సీఎం

ఇంగ్లిష్‌ వినియోగంపై బిహార్‌ ముఖ్యమంత్రి నీతీష్‌ కుమార్‌ మండిపడ్డారు. ఈ సారి స్వయంగా రాష్ట్ర చట్టసభలోనే తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. రాష్ట్ర శాసనమండలిలో ఒక బోర్డు ఇంగ్లిష్‌లో రాసి ఉండటాన్ని చూసి ఆయన కలత చెందారు.

Updated : 22 Mar 2023 05:46 IST

హిందీని బతకనివ్వరా అని ప్రశ్నించిన నీతీష్‌ కుమార్‌

పట్నా: ఇంగ్లిష్‌ వినియోగంపై బిహార్‌ ముఖ్యమంత్రి నీతీష్‌ కుమార్‌ మండిపడ్డారు. ఈ సారి స్వయంగా రాష్ట్ర చట్టసభలోనే తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. రాష్ట్ర శాసనమండలిలో ఒక బోర్డు ఇంగ్లిష్‌లో రాసి ఉండటాన్ని చూసి ఆయన కలత చెందారు. పక్కనే ఉన్న మండలి ఛైర్మన్‌ దేవేశ్‌ చంద్ర వద్ద తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. ‘హానరబుల్‌, స్పీకింగ్‌ టైమ్‌ లాంటి ఇంగ్లిష్‌ పదాలను ఇంకా వాడటంలో అర్థం ఏముంది?.. హిందీనీ అంతం చేయాలనుకుంటున్నారా’ అంటూ కాస్త కఠిన స్వరంతోనే ప్రశ్నించారు. వెంటనే ఛైర్మన్‌ కల్పించుకొని పరిస్థితిని శాంతపరిచేందుకు ప్రయత్నించారు. ఈ సంభాషణ మొత్తం ఒక నిమిషంలోపే ముగిసినా ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని