వలస కూలీకి డ్రీమ్‌ 11తో రూ.కోటి జాక్‌పాట్‌

పొట్టకూటి కోసం వేరే రాష్ట్రానికి వలస వెళ్లిన ఓ యువకుడిని అదృష్టం వరించింది. క్రికెట్‌ గేమింగ్‌ యాప్‌తో రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారిపోయాడు.

Updated : 23 Mar 2023 05:28 IST

పొట్టకూటి కోసం వేరే రాష్ట్రానికి వలస వెళ్లిన ఓ యువకుడిని అదృష్టం వరించింది. క్రికెట్‌ గేమింగ్‌ యాప్‌తో రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారిపోయాడు. ఝార్ఖండ్‌కు చెందిన సుశీల్‌కుమార్‌ జీవనోపాధి కోసం 15 ఏళ్ల క్రితం హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లా పాంగి ప్రాంతానికి వలస వెళ్లాడు. అక్కడి రాష్ట్ర విద్యుత్తుబోర్డులో నాలుగో తరగతి ఉద్యోగిగా పని చేస్తున్నాడు. సోదరుడితో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. సుశీల్‌కుమార్‌ గత ఏడాదిన్నర కాలంగా డ్రీమ్‌ 11 క్రికెట్‌ గేమింగ్‌ యాప్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకొంటూనే ఉన్నాడు.  తాజాగా ఆడిన గేమ్‌లో సుశీల్‌కుమార్‌ అక్షరాలా రూ.కోటి గెలుచుకున్నాడు. తాను ఈ పెద్ద మొత్తం గెలిచేకన్నా ముందు ఆ సమయంలో సుమారు 35 లక్షల మంది ఈ ఆట ఆడుతున్నారని సుశీల్‌ చెప్పాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ముంబయి ఇండియన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే కచ్చితమైన అంచనా వేయడం ద్వారానే ఇంత భారీ మొత్తాన్ని గెలుచుకున్నట్లు సుశీల్‌ తెలిపాడు. పన్ను మినహాయింపులు పోగా సుశీల్‌ చేతికి రూ.70 లక్షలు అందుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని