సీనియారిటీని గౌరవించాలి.. సుప్రీంకోర్టు కొలీజియం స్పష్టీకరణ
ముందుగా సిఫార్సు చేసిన జడ్జీల పేర్లపై నిర్ణయం తీసుకోకుండా కేంద్రం జాప్యం చేయడం తీవ్ర ఆందోళనకరమని, అటువంటి వారికి సీనియారిటీలో నష్టం జరుగుతోందని సుప్రీంకోర్టు కొలీజియం స్పష్టం చేసింది.
ముందే సిఫార్సు చేసిన జడ్జీల పేర్లపై నిర్ణయంలో జాప్యంతో నష్టమే
దిల్లీ: ముందుగా సిఫార్సు చేసిన జడ్జీల పేర్లపై నిర్ణయం తీసుకోకుండా కేంద్రం జాప్యం చేయడం తీవ్ర ఆందోళనకరమని, అటువంటి వారికి సీనియారిటీలో నష్టం జరుగుతోందని సుప్రీంకోర్టు కొలీజియం స్పష్టం చేసింది. వారిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. ముందుగా సూచించిన వారి పేర్లపై త్వరగా నిర్ణయం తీసుకోవడంద్వారా వారి సీనియారిటీకి ఇబ్బంది లేకుండా చూడాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం స్పష్టం చేసింది.
న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ కె.ఎం.జోసెఫ్‌లతో కూడిన కొలీజియం మద్రాస్ హైకోర్టుకు జడ్జీలుగా ఆర్.శక్తివేల్, పి.ధనబాల్, చిన్నసామి కుమరప్పన్, కె.రాజశేఖర్‌లను ఈనెల 21న సిఫార్సు చేసింది. జనవరి 17వ తేదీన న్యాయవాది రామస్వామి నీలకందన్ పేరును కొలీజియం సిఫార్సు చేసింది. 2023 మార్చి 31 నాటికి నీలకందన్ వయసు 48.07 ఏళ్లవుతుంది. కె.రాజశేఖర్ వయసు 47.09 ఏళ్లవుతుంది. ‘రాజశేఖర్ కంటే ముందే నీలకందన్‌ను సిఫార్సు చేసినందున తొలుత ఆయననే నియమించాల్సి ఉంది. అలా చేయకపోతే వయసులో చిన్నవారైన రాజశేఖర్ సీనియరు అవుతారు. అలాంటి సీనియారిటీ సమంజసం కాదు’ అని కొలీజియం స్పష్టం చేసింది. జనవరి 17న సిఫార్సు చేసిన ఆర్.జాన్ సత్యన్‌నూ ముందుగానే నియమించాలని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ తేదీలు వచ్చేశాయ్
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Asian Games: షూటింగ్లో మరో గోల్డ్.. వుషూలో రజతం
-
మా స్నేహం మీద ఒట్టు.. చంద్రబాబు ఎలాంటి తప్పూ చేయరు: బాబు బాల్య స్నేహితులు
-
Vijayawada: సీఎం సభకు మీరు రాకుంటే.. మా ఉద్యోగాలు పోతాయ్
-
Rohit Sharma: సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం.. వరల్డ్‌కప్ జట్టుపై నో డౌట్స్: రోహిత్