కరోనా పరీక్షలను పెంచండి.. సమీక్షలో ప్రధాని మోదీ ఆదేశం
దేశవ్యాప్తంగా తీవ్రమైన శ్వాసకోశ సమస్యలున్న వారిని గుర్తించేందుకు పరీక్షలను పెంచాలని, ల్యాబ్ సౌకర్యాలను విస్తరించాలని అధికారులను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు.
ఇన్‌ఫ్లుయెంజా, కొవిడ్ కేసులతో జాగ్రత్త
దిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్రమైన శ్వాసకోశ సమస్యలున్న వారిని గుర్తించేందుకు పరీక్షలను పెంచాలని, ల్యాబ్ సౌకర్యాలను విస్తరించాలని అధికారులను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. ఇన్‌ఫ్లుయెంజా, కొవిడ్ కేసులను గుర్తించి పాజిటివ్ శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపే ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీనివల్ల కొత్త వేరియంట్లను త్వరగా గుర్తించగలుగుతామని స్పష్టం చేశారు. గత రెండు వారాలుగా ఇన్‌ఫ్లుయెంజా, కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం దిల్లీలో ఆయన సమీక్ష జరిపారు. కేసులను ఎదుర్కొనే సన్నద్ధత, ఆసుపత్రుల్లోని సౌకర్యాలు, ఔషధాల రవాణా, టీకాల తీరు, కొవిడ్ వేరియంట్లతో అత్యవసర పరిస్థితి తలెత్తితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం, దేశంపై పడే ప్రభావం వంటి వాటిని సమీక్షించారు. కొవిడ్ కేసులు పెరుగుతున్నందున ఆసుపత్రుల్లో రోగులు, సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చూడాలని, వృద్ధులు, రద్దీ ప్రాంతాల్లో తిరిగేవారు మాస్కులను ధరించేలా ప్రోత్సహించాలని సమీక్షలో ప్రధాని పేర్కొన్నారు. సమీక్ష సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. దేశంలో రోజుకు సగటున 888 కొవిడ్ కేసులు నమోదవుతున్నాయని, 20 ప్రధాన కొవిడ్ ఔషధాలు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటికే సన్నద్ధతపై మాక్ డ్రిల్ నిర్వహించామని వివరించారు. 2020లో దేశంలో కరోనా కేసులు వెలుగు చూసినప్పుడు మార్చి 22నే ప్రధాని జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. సరిగ్గా మళ్లీ అదే రోజున బుధవారం (2023 మార్చి 22) ప్రధాని వైరస్‌ల విస్తృతిపై అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించడం గమనార్హం.
కొత్తగా 1,134 కేసులు
దేశంలో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్తగా మరో 1,134 కేసులు నమోదు కావడంతో బుధవారం నాటికి మొత్తం క్రియాశీల కేసులు 7,026కు చేరుకున్నాయి. మొత్తం మరణాలు 5,30,813గా నమోదయ్యాయి. తాజాగా 5 మరణాలు చోటుచేసుకున్నాయి. ఛత్తీస్‌గఢ్, దిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కేరళల్లో ఒక్కో మరణం నమోదైంది. కేరళలో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
KTR: ప్రజల కోసం ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ధరణి పోర్టల్: కేటీఆర్
-
World News
Japan: ఒకే రన్‌వేపైకి రెండు విమానాలు.. ఒకదాన్నొకటి తాకి..
-
Politics News
ChandraBabu: అక్రమాలను అడ్డుకోండి: సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ
-
Sports News
Team India Slip Cordon: టీమ్ ఇండియా స్లిప్ కార్డన్‌లో ఎవరు బెస్ట్.. ChatGPT ఏం చెప్పింది?
-
India News
Uttarakhand: సెలవులో ఉన్న టీచర్లకు రిటైర్మెంట్..! ఉత్తరాఖండ్ కీలక నిర్ణయం
-
World News
Trump: ప్రైవేట్ పార్టీలో దేశ రహస్యాలను లీక్ చేసిన ట్రంప్!