Sarus crane: కొంగ మీది బెంగతో.. యువరైతు కంటతడి

కొంగతో స్నేహం చేస్తూ ఇటీవల వార్తల్లోకెక్కిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీకి చెందిన మహ్మద్‌ ఆరిఫ్‌ఖాన్‌ నుంచి అటవీశాఖ అధికారులు ఆ పక్షిని స్వాధీనం చేసుకున్నారు.

Published : 23 Mar 2023 06:46 IST

పక్షిని స్వాధీనం చేసుకొన్న అటవీశాఖ

కొంగతో స్నేహం చేస్తూ ఇటీవల వార్తల్లోకెక్కిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీకి చెందిన మహ్మద్‌ ఆరిఫ్‌ఖాన్‌ నుంచి అటవీశాఖ అధికారులు ఆ పక్షిని స్వాధీనం చేసుకున్నారు. కొంగ దూరమైందన్న బాధతో ఆరిఫ్‌ కన్నీళ్లు పెట్టుకోగా.. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఏడాది క్రితం ఆరిఫ్‌ పొలంలో ఈ ‘సారస్‌’ కొంగ కనిపించింది. కాలు విరిగిపోయి, రక్తమోడుతూ ఉంది. కొంగ గాయం కడిగి.. పసుపు, ఆవాల మిశ్రమం వేసి వెదురు పుల్లలతో ఆరిఫ్‌ కట్టు కట్టాడు. కోలుకున్న కొంగ తనను కాపాడిన ఆరిఫ్‌తోనే ఉండిపోయింది. కొంగ ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర పక్షి. రాష్ట్ర పక్షులను సంరక్షించాలన్న ఉద్దేశంతో అటవీశాఖ అధికారులు ఆరిఫ్‌ వద్ద ఉన్న కొంగను మంగళవారం రాయ్‌బరేలీలోని సమస్‌పుర్‌ పక్షుల సంరక్షణ కేంద్రానికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు