ఏసీ త్రీటైర్‌ ఎకానమీలో పాతధర పునరుద్ధరణ

రైళ్లలో ఏసీ త్రీటైర్‌ ఎకానమీ తరగతి ధరలను పునరుద్ధరిస్తూ రైల్వేశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత నవంబరులో ఈ ధరలను ఉపసంహరించి, ఏసీ త్రీటైర్‌తో సమానం చేసింది.

Published : 23 Mar 2023 06:35 IST

దిల్లీ: రైళ్లలో ఏసీ త్రీటైర్‌ ఎకానమీ తరగతి ధరలను పునరుద్ధరిస్తూ రైల్వేశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత నవంబరులో ఈ ధరలను ఉపసంహరించి, ఏసీ త్రీటైర్‌తో సమానం చేసింది. అప్పట్లో ఎకానమీ తరగతిలో దుప్పట్లు, రగ్గుల సరఫరా ఉండేది కాదు. ఇప్పుడు ధర తగ్గినా.. వాటిని మాత్రం సరఫరా చేస్తారు. ఇప్పటికే ముందస్తు టికెట్లు తీసుకున్నవారికి వ్యత్యాసపు సొమ్మును వాపసు ఇస్తారు. సాధారణ థర్డ్‌ ఏసీతో పోలిస్తే ఎకానమీ తరగతి టికెట్‌ ధర 6 నుంచి 8% తక్కువ. ఏసీ త్రీటైర్‌లో 72 బెర్తులుంటే ఎకానమీలో 80 ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని