మోదీకి వ్యతిరేకంగా దిల్లీలో పోస్టర్లు

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా దిల్లీలో పోస్టర్లు వెలిశాయి. ‘మోదీ హఠావో.. దేశ్‌ బచావో (మోదీని తొలగించండి.. దేశాన్ని కాపాడండి)’ అనే నినాదంతో ఉన్న పోస్టర్లు దిల్లీలోని పలు ప్రాంతాల్లో కనిపించాయని పోలీసులు బుధవారం తెలిపారు.

Published : 23 Mar 2023 05:32 IST

49 ఎఫ్‌ఐఆర్‌ల నమోదు, ఆరుగురి అరెస్టు

దిల్లీ: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా దిల్లీలో పోస్టర్లు వెలిశాయి. ‘మోదీ హఠావో.. దేశ్‌ బచావో (మోదీని తొలగించండి.. దేశాన్ని కాపాడండి)’ అనే నినాదంతో ఉన్న పోస్టర్లు దిల్లీలోని పలు ప్రాంతాల్లో కనిపించాయని పోలీసులు బుధవారం తెలిపారు. దీనిపై పోలీసులు 49 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఇద్దరు ముద్రణాలయ యజమానులు సహా ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. తొలుత 100 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు ప్రకటించిన పోలీసులు ఆ తర్వాత ఆ సంఖ్యను సవరించారు. మొత్తం 50 వేల పోస్టర్ల ముద్రణకు ఆర్డర్లు ఇచ్చినట్లు తెలుస్తోందని, ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన ఓ వ్యాను నుంచి 2 వేలకు పైగా పోస్టర్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరకూ 20 వేలకు పైగా పోస్టర్లను పట్టుకున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో అతికించిన గోడ పత్రికలను తొలగించినట్లు తెలిపారు. ఈ పోస్టర్లపై ముద్రణాలయ వివరాలు ప్రచురించలేదని చెప్పారు. దీని వెనుక ఆప్‌ కార్యకర్తల హస్తం ఉందా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు