అమృత్‌పాల్‌కు పాక్ నుంచి ఆయుధాలు!
ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్‌కు సంబంధించి రోజురోజుకూ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అతడు పాకిస్థాన్ నుంచి ఆయుధాలు సేకరించే పనిలో ఉన్నాడని ఓ ఇంటెలిజెన్స్ అధికారి వెల్లడించారు.
పంజాబ్‌లో కల్లోలం సృష్టించేందుకు యత్నాలు
అతనికి పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు
చండీగఢ్: ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్‌కు సంబంధించి రోజురోజుకూ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అతడు పాకిస్థాన్ నుంచి ఆయుధాలు సేకరించే పనిలో ఉన్నాడని ఓ ఇంటెలిజెన్స్ అధికారి వెల్లడించారు. దీంతోపాటు పంజాబ్‌లో కల్లోలం సృష్టించాలనే ప్రణాళికతో అతడు పనిచేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. పాక్ ఐఎస్‌ఐ సాయంతో ఇప్పటికే రప్పించిన ఆయుధాలను డీఅడిక్షన్ కేంద్రాలు, జల్‌పూర్ ఖేడా వద్ద కొన్ని ప్రార్థనా మందిరాల్లో భద్రపర్చినట్లు సమాచారం. దీంతోపాటు అక్రమ ఆయుధాల తరలింపు, తుపాకులను బహిరంగంగా ప్రదర్శించడం వంటి పనులు చేశాడు.
అంతేకాకుండా ఖలిస్థాన్ గురించి మాట్లాడే అమృత్‌పాల్‌కు చాలా మంది మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. వీటికి సంబంధించి మహిళలతో ఛాటింగ్‌లు, వాయిస్‌నోట్‌లు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే 12 వాయిస్ నోట్‌లు ఓ మీడియా సంస్థ చేతికి వచ్చాయి. వాటిల్లో మహిళలతో టైంపాస్ కోసం సంబంధాలు పెట్టుకొంటున్నట్లు అతడు చెబుతున్న మాటలు ఉన్నాయి. ఈ మహిళల్లో కొందరు వివాహితలు కూడా ఉన్నట్లు గుర్తించారు. అతడి ఇన్‌స్టాగ్రామ్ సందేశాల్లో ఓ మహిళను వివాహేతర సంబంధం గురించి అడుగుతున్నట్లు ఉంది.
అమృత్‌పాల్ సింగ్ కోసం వేటను కొనసాగిస్తున్న పోలీసులు మరోపక్క అతడి గత చరిత్రను తవ్వితీస్తున్నారు. అతడి దేశ వ్యతిరేక అజెండాను కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు బట్టబయలు చేసేపనిలో ఉన్నాయి. తాజాగా అమృత్‌పాల్ తన బైకును మరో వాహనంపై పెట్టి ప్రయాణిస్తున్న చిత్రాలను పోలీసులు గుర్తించారు. అతడి భార్య, తల్లిని ప్రశ్నిస్తున్నారు.
పంజాబ్ పోలీసులకు నిందితురాలి అప్పగింత
హరియాణా కురుక్షేత్ర జిల్లాలో అమృత్‌పాల్‌కు ఆశ్రయం ఇచ్చిన ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను బల్జీత్ కౌర్‌గా పేర్కొన్న హరియాణా పోలీసులు... అమృత్‌పాల్, అతని సహచరుడు పాపల్‌ప్రీత్ సింగ్‌కు ఆదివారం షాహాబాద్‌లోని తన ఇంట్లో ఆ మహిళ ఆశ్రయం ఇచ్చిందని చెప్పారు. నిందితురాలిని పంజాబ్ పోలీసులకు అప్పగించినట్లు వివరించారు.
ప్రైవేటు సెక్యూరిటీ గార్డు అరెస్టు
అమృత్‌పాల్ సింగ్ ప్రైవేట్ సెక్యూరిటీలో భాగమైన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. లూధియానా జిల్లాలోని ఖన్నా ప్రాంతంలోని మంగేవాల్ గ్రామానికి చెందిన తేజిందర్ సింగ్ గిల్... అమృత్‌పాల్ సింగ్‌కు వ్యక్తిగత భద్రత కల్పించే వారిలో ఒకరని చెప్పారు. అమృత్ కోసం గాలిస్తున్న క్రమంలో నిందితుడు చిక్కినట్లు వివరించారు. మరోవైపు, పోలీసులు అదుపులోకి తీసుకున్న అమృత్‌పాల్ సింగ్ సోదరుడు హర్‌ప్రీత్ సింగ్‌తో పాటు 11 మంది సహచరులను గురువారం పంజాబ్‌లోని బాబా బకాలా కోర్టులో హాజరుపరిచారు. ఆయుధాల కేసులో అంతకుముందు న్యాయస్థానం.. వారిని 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపగా గురువారంతో గడువు ముగిసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Ashwini Vaishnaw: రెండు రోజులు ఘటనా స్థలిలోనే.. కార్మికుల్లో ఒకడిగా కేంద్రమంత్రి వైష్ణవ్
-
Politics News
Nara Lokesh: మేనల్లుడూ మేనమామా ఇద్దరూ దోపిడీదారులే
-
India News
Odisha Train Accident: ప్రజల దృష్టి మళ్లించేందుకే ‘కుట్ర కోణం’: సీబీఐ పూర్వ డైరెక్టర్ నాగేశ్వరరావు
-
Politics News
Vallabhaneni Vamsi: పంతం నెగ్గించుకున్న గన్నవరం ఎమ్మెల్యే!
-
India News
దిగంబరత, అశ్లీలత ఒకటి కాదు: హైకోర్టు
-
Crime News
హైటెక్ మాస్‌కాపీయింగ్‌లో మాజీ ఎంపీటీసీ కుమార్తె..!