ఈడీ డైరెక్టర్‌ పదవీకాలం పొడిగింపుపై పిటిషన్లను తిరస్కరించలేం: సుప్రీం

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) డైరెక్టరు పదవీ కాలాన్ని ఐదేళ్లకు పొడిగించాలన్న చట్ట సవరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించలేమని కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Published : 24 Mar 2023 04:25 IST

దిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) డైరెక్టరు పదవీ కాలాన్ని ఐదేళ్లకు పొడిగించాలన్న చట్ట సవరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించలేమని కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈడీ కేసులున్న నేతలు రాజకీయ కారణాలతో అవి వేశారన్న కేంద్రం వాదనతో ఏకీభవించలేమని పేర్కొంది. పిటిషనర్లపై కేసులుంటే తమ ఇబ్బందులపై కోర్టును ఆశ్రయించే అధికారం వారికీ ఉంటుందని జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది. పిటిషనర్లు, పార్టీలు, ప్రభుత్వం తరఫున వాదనల అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 20వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని