మళ్లీ జాగ్రత్త పడాల్సిందేనా!..140 రోజుల తర్వాత అత్యధిక కొవిడ్ కేసుల నమోదు
దేశంలో గత కొన్నిరోజులుగా కొవిడ్-19తోపాటు ఇన్‌ఫ్లుయెంజా కేసులు పెరుగుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి.
దిల్లీ: దేశంలో గత కొన్నిరోజులుగా కొవిడ్-19తోపాటు ఇన్‌ఫ్లుయెంజా కేసులు పెరుగుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. 140 రోజుల తర్వాత మళ్లీ ఇపుడు అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8.00 గంటల వరకు దేశంలో 1,300 కొవిడ్ కేసులను గుర్తించారు. ముందురోజుతో పోలిస్తే 166 కేసులు పెరిగాయి. ఈ మహమ్మారి వల్ల తాజాగా కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రల్లో ముగ్గురు ప్రాణాలు విడిచారు. బుధవారం ఒక్కరోజే 718 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.02 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో బుధవారం 7,530 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీచేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 220.65 కోట్లకు చేరింది. బుధవారం ఒక్కరోజే 89,078 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య, మరణాల్లో ఎటువంటి పెరుగుదల నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Harish Rao: అందుకే మన ‘మిషన్ కాకతీయ’ దేశానికే ఆదర్శం: హరీశ్‌రావు
-
India News
Wrestlers Protest: బ్రిజ్‌భూషణ్‌పై పోక్సో కేసులో ఆమె మైనర్ కాదా..? ఆమె తండ్రి ఏం చెప్పారంటే..?
-
Movies News
Shiva Balaji: జాతకాలు కుదరలేదని బ్రేకప్ చెప్పేసుకున్నాం..: శివ బాలాజీ
-
Crime News
Hyderabad: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. క్షుద్రపూజల వల్లేనంటున్న తల్లిదండ్రులు
-
India News
Air India: ఎట్టకేలకు 39 గంటల తర్వాత.. రష్యా నుంచి అమెరికాకు ఎయిరిండియా విమానం
-
India News
Odisha Train Accident: మృతుల్ని గుర్తించేందుకు కృత్రిమ మేధ