వాట్సప్‌ కొత్త డెస్క్‌టాప్‌ యాప్‌

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ డెస్క్‌టాప్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా కొత్త విండోస్‌ డెస్క్‌టాప్‌ యాప్‌ను ఆవిష్కరించింది.

Updated : 24 Mar 2023 05:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ డెస్క్‌టాప్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా కొత్త విండోస్‌ డెస్క్‌టాప్‌ యాప్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త యాప్‌ను మైక్రోసాఫ్ట్‌ యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌ ద్వారా ఏకకాలంలో 8 మందితో వీడియో కాల్‌లో సంభాషించొచ్చు. 32 మందితో గ్రూప్‌ ఆడియో కాల్స్‌ మాట్లాడొచ్చు. భవిష్యత్‌లో ఈ సంఖ్యను మరింత పెంచుతామని వాట్సప్‌ హామీ ఇచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు