విమానంలో తప్పతాగి గొడవ.. ఇద్దరి అరెస్ట్‌

దుబాయి నుంచి ముంబయికి వస్తున్న ఇండిగో విమానం (6ఈ 1088)లో తప్పతాగి సిబ్బందిని దుర్భాషలాడి, తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు.

Published : 24 Mar 2023 04:25 IST

ముంబయి: దుబాయి నుంచి ముంబయికి వస్తున్న ఇండిగో విమానం (6ఈ 1088)లో తప్పతాగి సిబ్బందిని దుర్భాషలాడి, తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. విమానం బుధవారం ముంబయిలో దిగగానే వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, బెయిలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఇండిగో విమాన సర్వీసు సంస్థ సైతం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘దుబాయి నుంచి ముంబయికి వచ్చిన ఆ ఇద్దరు ప్రయాణికులు విపరీతంగా తాగిన మత్తులో దూషణకు దిగారు. సిబ్బంది పలుమార్లు హెచ్చరించినా ప్రయోజనం లేకపోయింది. ప్రొటోకాల్‌ ప్రకారం సీఐఎస్‌ఎఫ్‌కు అప్పగించాం. సమీప పోలీస్‌స్టేషనులో ఫిర్యాదు చేశాం. ఇతర ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం’’ అని అందులో పేర్కొన్నారు. నిందితులు ఇద్దరూ మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌, కొల్హాపుర్‌ ప్రాంతాలకు చెందినవారు. వీరు ఏడాదిపాటు గల్ఫ్‌లో పనిచేసి, స్వస్థలాలకు తిరిగొస్తూ ఈ అకృత్యానికి పాల్పడ్డారు. అధికారుల సమాచారం మేరకు.. ఈ ఏడాది విమాన ప్రయాణికుల అనుచిత ప్రవర్తన కేసు నమోదు దాకా వెళ్లిన ఏడో సంఘటన ఇది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు