రూ.45లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌కు ఆమోదం
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను కేంద్ర ప్రభుత్వం సమర్పించిన సుమారు రూ.45,03,097 కోట్ల బడ్జెట్‌కు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది.
చర్చ లేకుండానే 2023 పద్దుకు లోక్‌సభ అనుమతి
దిల్లీ: ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను కేంద్ర ప్రభుత్వం సమర్పించిన సుమారు రూ.45,03,097 కోట్ల బడ్జెట్‌కు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. అదానీ గ్రూప్ కంపెనీల వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్న విపక్షాలు తమ ఆందోళనను కొనసాగిస్తుండగానే బడ్జెట్ అంశాన్ని సభ చేపట్టింది. అంతకుముందు లోక్‌సభ రెండు మార్లు వాయిదాపడింది. సాయంత్రం 6 గంటలకు తిరిగి సమావేశమైన తర్వాత సభాపతి ఓం బిర్లా.. ప్రభుత్వ వ్యయ ప్రణాళికపై విపక్షాలిచ్చిన కోత తీర్మానాన్ని చేపట్టగా సభ మూజువాణి ఓటుతో తిరస్కరించింది. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యయ అంచనాలు, వినియోగ బిల్లులను చర్చ కోసం ప్రతిపాదించారు. ఆ తర్వాత సభాపతి వాటిపై ఓటింగ్ జరిపారు. విపక్ష పార్టీల సభ్యులు సభా మధ్యలోకి వెళ్లి నినాదాలు కొనసాగిస్తుండగానే అధికార పక్షం బిల్లులన్నింటికీ ఆమోదం తెలిపింది. వార్షిక బడ్జెట్‌కు 2/3వంతు మంది సభ్యుల మద్దతు లభించినట్లయ్యింది. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా సభలో ఉన్నారు. బడ్జెట్ ఆమోదం ప్రక్రియ 12 నిమిషాల్లో ముగిసింది. లోక్‌సభ కార్యకలాపాలకు వరుసగా అంతరాయం కలగడంతో చర్చ లేకుండానే బడ్జెట్‌ను ఆమోదించినట్లైంది. బడ్జెట్ సంబంధిత బిల్లులన్నీ కూడా రాజ్యసభకు బదిలీ కానున్నాయి. చర్చించిన అనంతరం వీటికి ఎలాంటి సవరణలు ప్రతిపాదించకుండా ఆమోదించడం లేదా లోక్‌సభకు తిప్పిపంపించడం మాత్రమే ఎగువసభ చేయగలదు.
2023-24 బడ్జెట్ పత్రాల ప్రకారం..
మొత్తం వ్యయం అంచనా: రూ.45,03,097 కోట్లు
రాజ్యసభ వాయిదా
బ్రిటన్ పర్యటనలో భారత ప్రజాస్వామ్యంపై వ్యాఖ్యలకు గాను రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని భాజపా ఎంపీలు, అదానీ కంపెనీలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీల సభ్యుల పోటాపోటీ నినాదాల మధ్య గురువారం రాజ్యసభ ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకుండానే వాయిదాపడింది. ఎగువసభ గురువారం రెండు సార్లు సమావేశమైనా ఇదే పరిస్థితి ఎదురుకావడంతో అధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
పార్లమెంటు ప్రాంగణంలో విపక్షాల ర్యాలీ
అదానీ గ్రూప్ కంపెనీలపై జేపీసీతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ పలు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు గురువారం పార్లమెంటు ప్రాంగణంలో ప్రదర్శన నిర్వహించారు. పార్లమెంటు హౌస్ ఒకటో నంబరు గేటు నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వం వహించారు. జేపీసీని నియమించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని విపక్ష నేతలు ప్రకటించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (31/05/2023)
-
India News
Maharashtra: మహారాష్ట్ర రైతుల కోసం కొత్త పథకం.. రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం
-
Politics News
Shiv Sena: మహారాష్ట్రలో మళ్లీ రాజకీయ అలజడి..ఆసక్తి రేపుతున్న శివసేన నేతల వ్యాఖ్యలు!
-
General News
Cyber Crimes: ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారా? ఈ ‘5s’ ఫార్ములా మీ కోసమే!
-
World News
Flight Passengers: బ్యాగేజ్‌తో పాటు ప్రయాణికుల శరీర బరువూ కొలవనున్న ఎయిర్‌లైన్స్ సంస్థ!
-
Crime News
ప్రియుడితో భార్య పరారీ.. స్టేషన్‌కు భర్త బాంబు బెదిరింపు ఫోన్‌కాల్!