లోక్‌పాల్‌ ఒక్కరినీ ప్రాసిక్యూట్‌ చేయలేదు

ప్రజాప్రతినిధుల అవినీతిపై విచారణకు నియమించిన లోక్‌పాల్‌ పనితీరు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోందని పార్లమెంటరీ స్థాయీ సంఘం స్పష్టం చేసింది.

Published : 24 Mar 2023 05:27 IST

పార్లమెంటరీ స్థాయీ సంఘం స్పష్టీకరణ

దిల్లీ: ప్రజాప్రతినిధుల అవినీతిపై విచారణకు నియమించిన లోక్‌పాల్‌ పనితీరు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోందని పార్లమెంటరీ స్థాయీ సంఘం స్పష్టం చేసింది. అది ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకూ ఒక్కరినీ ప్రాసిక్యూట్‌ చేయలేదని పేర్కొంది. ఇటీవల లోక్‌పాల్‌పై నివేదికను స్థాయీ సంఘం పార్లమెంటు ముందుంచింది.

నివేదికలోని వివరాలివీ..

సరైన ప్రొఫార్మాలో లేవంటూ పలు ఫిర్యాదులను లోక్‌పాల్‌ తిరస్కరించింది.

గత మే నుంచి లోక్‌పాల్‌ పోస్టును భర్తీ చేయలేదు.

సరైన కారణం లేకుండానే ఫిర్యాదులను లోక్‌పాల్‌ తిరస్కరించడం సరికాదు.

అవినీతికి వ్యతిరేకంగా జీ-20 గళమెత్తుతున్న వేళ దేశంలో అవినీతికి సంబంధించిన అంశాలపై లోక్‌పాల్‌ క్రియాశీలం కావాలి.

ఒక్క 2022-23లోనే అవినీతికి వ్యతిరేకంగా సరైన ప్రొఫార్మాలో లేని 2,518 ఫిర్యాదులు వచ్చాయి.

సరైన ప్రొఫార్మాలో 242 ఫిర్యాదులు రాగా 191 పరిష్కారమయ్యాయి.

2020 నుంచి ఇద్దరు జ్యుడిషియల్‌ సభ్యుల నియామకమూ జరగలేదు.

లోక్‌పాల్‌కు మొత్తం 82 శాశ్వత పోస్టులు మంజూరు చేయగా ప్రస్తుతం 32 మందే పని చేస్తున్నారు.

మరో 62 మంది కాంట్రాక్టు పద్ధతిలో సేవలందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని