ఐఏఎస్‌ అధికారిణిని బదిలీ చేయాలంటూ గడ్కరీ లేఖ

మహారాష్ట్రలో ఓ ఐఏఎస్‌ అధికారిణిని బదిలీ చేయాలని కోరుతూ సీఎం శిందేకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ లేఖ రాయడం వివాదాస్పదమవుతోంది! ఆయన లేఖపై విరుద్ధ ప్రయోజనాల సంబంధిత ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Updated : 24 Mar 2023 05:46 IST

ముంబయి: మహారాష్ట్రలో ఓ ఐఏఎస్‌ అధికారిణిని బదిలీ చేయాలని కోరుతూ సీఎం శిందేకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ లేఖ రాయడం వివాదాస్పదమవుతోంది! ఆయన లేఖపై విరుద్ధ ప్రయోజనాల సంబంధిత ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మహారాష్ట్ర వైద్య విద్యాశాఖ కార్యదర్శిగా డాక్టర్‌ అశ్వినీ జోషి ఉన్నారు. ‘కాలేజ్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ అండ్‌ సర్జన్స్‌ (సీపీఎస్‌)’ అనుబంధ ఇన్‌స్టిట్యూట్‌లు అందించే కోర్సులకు సంబంధించిన 1,100 అడ్మిషన్లను నిలిపివేసినందుకుగాను ఆమెను విమర్శిస్తూ సీఎంకు 9న గడ్కరీ లేఖ రాశారు. ఆమె వల్ల వైద్య విద్యాశాఖ పనితీరు దెబ్బతిందని ఆరోపించారు. అయితే సీపీఎస్‌ అనుబంధ ఇన్‌స్టిట్యూట్‌ల అసోసియేషన్‌ సలహా మండలిలో నితిన్‌ గడ్కరీ భార్య కాంచన్‌ గడ్కరీ కూడా ఉన్నారు. దీంతో- ఆయన లేఖ విరుద్ధ ప్రయోజనాల పరిధిలోకి వస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని