అప్పులు తీర్చే స్తోమత ఉన్నా.. విదేశాల్లో ఆస్తుల కొనుగోలు
దేశంలోని వివిధ బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయి తలదాచుకున్న పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా వద్ద భారీగా నిధులున్నా, తీవ్ర సంక్షోభంలో ఉన్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను కాపాడే ప్రయత్నం.
ఇందుకు రూ.330 కోట్లు వెచ్చించిన మాల్యా: సీబీఐ
ముంబయి: దేశంలోని వివిధ బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయి తలదాచుకున్న పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా వద్ద భారీగా నిధులున్నా, తీవ్ర సంక్షోభంలో ఉన్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను కాపాడే ప్రయత్నం ఎక్కడా చేయలేదని తాజా అనుబంధ ఛార్జిషీటులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) పేర్కొంది. కింగ్‌ఫిషర్ పేరు మీద తీసుకున్న బ్యాంకు రుణాలను వివిధ మార్గాల్లో మళ్లించి సుమారు రూ.330 కోట్లతో ఇంగ్లాండ్, ఫ్రాన్స్‌లో మాల్యా ఆస్తులు కొనుగోలు చేశారని వెల్లడించింది. ఎయిర్‌లైన్స్‌ను గట్టెక్కించేందుకు తగినన్ని నిధులు 2008, 2016-17లో మాల్యా దగ్గర ఉన్నా, ఆయన ఆ పని చేయలేదని ఆక్షేపించింది. 2008-12 మధ్య భారీగా నిధులను ఫోర్స్ ఇండియా ఫార్ములా వన్ టీమ్‌కు, మరికొన్ని నిధులను 2007, 2012-13 మధ్య తాను వాడుతున్న కార్పొరేట్ జెట్ విమానం రుణం తీర్చడానికి మళ్లించారని పేర్కొంది.ఐడీబీఐ బ్యాంకును రూ.900 కోట్ల మేర మాల్యా మోసం చేశాడన్న ఆరోపణలపై విచారణ చేస్తున్న సీబీఐ, తాజా ఛార్జిషీటులో ఐడీబీఐ బ్యాంకు మాజీ జనరల్ మేనేజర్ బుద్ధదేవ్‌దాస్ గుప్తాను నిందితునిగా చేర్చింది. బుద్ధదేవ్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి.. మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు రూ.150 కోట్ల స్వల్పకాలిక రుణం మంజూరు చేశారని ఆరోపణ చేసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Dhoni Fans: ధోనీ అభిమానులకు అక్కడే పడక
-
Crime News
TDP-Mahanadu: మహానాడు నుంచి వెళ్తూ తెదేపా నాయకుడి దుర్మరణం
-
Crime News
Murder: 16 ఏళ్ల బాలిక దారుణహత్య.. 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు!
-
Ts-top-news News
రాష్ట్రంలో త్వరలోనే క్రీడాపాలసీ
-
Crime News
చాట్ జీపీటీతో జవాబులు.. ఎలక్ట్రానిక్ డివైస్‌తో చేరవేత!
-
Sports News
Ambati Rayudu: చివరి మ్యాచ్‌లో రాయుడు మెరుపు షాట్లు.. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ముగింపు