ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్‌ కారణమా?

దేశంలో కొవిడ్‌ కేసులు మళ్లీ పెరగడానికి ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్‌ కారణమై ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇన్సాకాగ్‌ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా కొవిడ్‌ పాజిటివ్‌ కేసులకు నిర్వహించిన.

Updated : 24 Mar 2023 05:44 IST

దిల్లీ: దేశంలో కొవిడ్‌ కేసులు మళ్లీ పెరగడానికి ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్‌ కారణమై ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇన్సాకాగ్‌ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా కొవిడ్‌ పాజిటివ్‌ కేసులకు నిర్వహించిన జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లో 344 కేసులు ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్‌కు సంబంధించినవే ఉన్నట్లు వెల్లడైంది. దేశంలో మొదటిసారిగా ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్‌కు సంబంధించి 2 కేసులు జనవరిలో బయటపడ్డాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ సంఖ్య వందల్లోకి చేరినట్లు ఇండియన్‌ సార్స్‌కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్షియం వెల్లడించింది. మొత్తంగా తొమ్మిది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 344 నమూనాల్లో ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్‌ బయటపడినట్లు ఇన్సాకాగ్‌ తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో ఈ వేరియంట్‌ కేసులు 105 బయటపడగా.. తెలంగాణలో 93, కర్ణాటకలో 57, గుజరాత్‌ 54 కేసులు తేలాయి. కొవిడ్‌ తాజా విజృంభణకు కొత్త వేరియంట్‌ కారణమై ఉండొచ్చని.. అయినప్పటికీ తీవ్రమైన జబ్బు, మరణానికి దారి తీయనంతవరకు భయపడాల్సిన అవసరం లేదని ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అన్నారు. వైరస్‌లో మ్యుటేషన్లు జరుగుతున్నకొద్దీ ఇటువంటి కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు