నేడు జగదల్‌పుర్‌కు మహిళా జవాన్ల బైక్‌ ర్యాలీ

సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 75 మంది మహిళా జవాన్లు బైక్‌లపై దిల్లీ నుంచి ఛత్తీస్‌గఢ్‌ బస్తర్‌ జిల్లాలోని జగదల్‌పుర్‌ పయనమయ్యారు. 84వ సీఆర్‌పీఎఫ్‌ డే సందర్భంగా.. జగదల్‌పుర్‌లో జరగనున్న వేడుకల్లో వీరు పాల్గొంటారు.

Published : 24 Mar 2023 05:27 IST

ఈటీవీ భారత్‌: సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 75 మంది మహిళా జవాన్లు బైక్‌లపై దిల్లీ నుంచి ఛత్తీస్‌గఢ్‌ బస్తర్‌ జిల్లాలోని జగదల్‌పుర్‌ పయనమయ్యారు. 84వ సీఆర్‌పీఎఫ్‌ డే సందర్భంగా.. జగదల్‌పుర్‌లో జరగనున్న వేడుకల్లో వీరు పాల్గొంటారు. మొత్తం 1,848 కి.మీ. వీరు ప్రయాణించనున్నారు. గురువారం వరకు 1,650 కి.మీ. ప్రయాణించి ఛత్తీస్‌గఢ్‌లోని ధమ్‌తరికి చేరుకున్నారు. ఈ నెల 9న ఇండియా గేట్‌ నుంచి.. వీరు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. 25న జగదల్‌పుర్‌కు చేరుకుంటారు. మహిళా సాధికారతను సమాజానికి చూపించడమే బైక్‌ ర్యాలీ ఉద్దేశమని జవాన్లు చెబుతున్నారు.           

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని