కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఆహ్వానం

దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.

Published : 25 Mar 2023 04:54 IST

ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఒకటో తరగతిలో ప్రవేశాలకు మార్చి 31 నాటికి ఆరేళ్లు నిండిన వారు అర్హులు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు 27వ తేదీ ఉదయం పది గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. దరఖాస్తుల సమర్పణకు తుది గడువు ఏప్రిల్‌ 17వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంది. వెబ్‌సైట్‌: https://kvsonlineadmission.kvs.gov.in/ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు మొబైల్‌ యాప్‌ను వినియోగించుకోవచ్చు. యాప్‌ https://kvsonlineadmission.kvs.gov.in/apps/ రెండో తరగతి ఆపైన తరగతుల్లో ఖాళీల ఆధారంగా ప్రవేశాలకు అనుమతిస్తారు. ఆయా పాఠశాలల్లోనే దరఖాస్తులు తీసుకొని సమర్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ మూడో తేదీ నుంచి ఏప్రిల్‌ 12వ తేదీ వరకు ఆయా పాఠశాలల్లో స్వయంగా దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని