Rahul Gandhi : రాహుల్‌ అధికార బంగళా ఖాళీ చేయాల్సిందేనా!

పార్లమెంటు సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటితమైన రాహుల్‌ గాంధీకి క్రిమినల్‌ పరువు నష్టం కేసులో ఉన్నత న్యాయస్థానం నుంచి ఊరట లభించకపోతే.. ఆయన దిల్లీలో అధికార నివాసాన్ని ఖాళీ చేయాల్సి వస్తుంది.

Updated : 25 Mar 2023 08:05 IST

దిల్లీ: పార్లమెంటు సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటితమైన రాహుల్‌ గాంధీకి క్రిమినల్‌ పరువు నష్టం కేసులో ఉన్నత న్యాయస్థానం నుంచి ఊరట లభించకపోతే.. ఆయన దిల్లీలో అధికార నివాసాన్ని ఖాళీ చేయాల్సి వస్తుంది. 2004లో లోక్‌సభకు ఎన్నికైనప్పటి నుంచి రాహుల్‌కు తుగ్లక్‌ లైనులోని 12వ నంబరు బంగళాను కేటాయించారు. రాహుల్‌కు ఊరట లభిస్తే తప్ప మార్చి 23 నుంచి నెలరోజుల్లోపు తన అధికార బంగళాను ఆయన ఖాళీచేయక తప్పదు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ భద్రతా బందోబస్తును తగ్గించినందున ఆమె కూడా 2020 జూలైలో తన అధికార బంగళాను ఖాళీచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని