కొవిడ్‌ పరీక్షలు తగ్గించకండి

దేశంలోని చాలా రాష్ట్రాల్లో కొవిడ్‌ పరీక్షలు తగ్గించారని, ఇది ఏమాత్రం మంచిదికాదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను హెచ్చరించింది.

Published : 26 Mar 2023 03:59 IST

రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్రం

ఈనాడు, దిల్లీ: దేశంలోని చాలా రాష్ట్రాల్లో కొవిడ్‌ పరీక్షలు తగ్గించారని, ఇది ఏమాత్రం మంచిదికాదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను హెచ్చరించింది. ఈమేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌భూషణ్‌, వైద్యపరిశోధన విభాగం కార్యదర్శి రాజీవ్‌బహల్‌లు సంయక్తంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు శనివారం లేఖరాశారు. ‘‘ఫిబ్రవరి నెల మధ్య నుంచి దేశంలో కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. దేశంలో అత్యధిక క్రియాశీలక కేసులు కేరళ (26.4%), మహారాష్ట్ర (21.7%), గుజరాత్‌ (13.9%), కర్ణాటక (8.6%), తమిళనాడు (6.3%)ల్లో ఉన్నాయి. అయితే అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ విస్తృతంగా జరగడంతో వ్యాధితీవ్రత తక్కువగానే ఉంది. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాలు కూడా అంతగా లేవు. అయితే గత కొన్నివారాలుగా చాలా రాష్ట్రాల్లో కొవిడ్‌ పరీక్షలు తగ్గాయి. ప్రతి పది లక్షలకు 140 పరీక్షలు నిర్వహించాలన్న డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాలతో పోలిస్తే ప్రస్తుత పరీక్షలు చాలా తక్కువ సంఖ్యలో జరుగుతున్నాయి’’ అని ఇద్దరు కార్యదర్శులు ఈ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.

146 రోజుల్లో అత్యధికం

గడిచిన 24 గంటల కరోనా కేసుల సంఖ్యను శనివారం ఉదయం కేంద్రం వెల్లడించింది. కొత్తగా 1,590 కేసులు వెలుగుచూశాయని తెలిపింది. 146 రోజుల్లో ఇదే అత్యధికమని తెలిపింది. క్రియాశీలక కేసులు 8,601కు చేరాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని