పెళ్లి కోసం 4 గంటల పెరోల్.. వివాహం చేసుకుని మళ్లీ జైలుకెళ్లిన వరుడు
అత్యాచార ఆరోపణలతో 20 రోజుల క్రితం జైలుకెళ్లిన ఓ యువకుడు.. అదే బాధితురాలిని పెళ్లి చేసుకునేందుకు నాలుగు గంటల పాటు పెరోల్‌పై విడుదయ్యాడు.
అత్యాచార బాధితురాలే వధువు
పట్నా: అత్యాచార ఆరోపణలతో 20 రోజుల క్రితం జైలుకెళ్లిన ఓ యువకుడు.. అదే బాధితురాలిని పెళ్లి చేసుకునేందుకు నాలుగు గంటల పాటు పెరోల్‌పై విడుదయ్యాడు. బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ పెళ్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడి పేరు రాహుల్ కుమార్. హాజీపుర్‌లో ఇంజినీరింగ్ చదివాడు. బాధిత యువతి ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అమ్మాయి. వీరిద్దరూ మంచి స్నేహితులు. వీరి స్నేహం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మార్చి 4న వీరు గోపాల్‌గంజ్‌లోని ఓ గుడికి వెళ్లారు. ఆరోజు రాత్రి రాహుల్ కుమార్ స్నేహితుని ఇంటికి వెళ్లారు. ఆ రాత్రి జరిగిన ఘటనతో యువతి ఆరోగ్యం క్షీణించింది. యువతి అత్యాచారానికి గురైనట్లు వైద్యులు అభిప్రాయపడ్డారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రాహుల్‌ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. తాను అత్యాచారం చేయలేదనీ, ఇద్దరం ప్రేమించుకున్నామని కోర్టులో తెలిపిన నిందితుడు ఆమెను వివాహం చేసుకునేందుకు అనుమతి కోరాడు. పెరోల్‌పై వచ్చి పెళ్లి చేసుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
భారత్‌కు తిరిగి రానున్న శివాజీ ‘పులి గోళ్లు’!
-
‘సీఎం ఇంటికి కూతవేటు దూరంలోనే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం’
-
కన్నవారి నడుమ కుదరని ఏకాభిప్రాయం.. మూడేళ్ల చిన్నారికి పేరు పెట్టిన హైకోర్టు
-
Chandrababu: జైలులో నేడు చంద్రబాబు దీక్ష
-
తిరుమలలో బ్రేక్ దర్శనం, గదుల బుకింగ్‌కు ‘పే లింక్’ సందేశాలతో నగదు చెల్లింపు!
-
విశాఖలో పిడుగు పాటు.. వీడియో వైరల్