బోరు నుంచి బంగారం పొడి!

బోరు నుంచి బురదతో పాటు బంగారు రంగుతో కూడిన పొడి వెలువడటంతో అధికారులు బోరును సీజ్‌ చేశారు.

Published : 26 Mar 2023 06:37 IST

కటక్‌, న్యూస్‌టుడే: బోరు నుంచి బురదతో పాటు బంగారు రంగుతో కూడిన పొడి వెలువడటంతో అధికారులు బోరును సీజ్‌ చేశారు. వెలువడిన మట్టి నమూనాను సేకరించి ల్యాబ్‌కు పరీక్షలకు పంపించారు. ఒడిశాలోని బొలంగీర్‌ జిల్లా చంచన బహాలి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు మహమ్మద్‌ జావెద్‌ తన పొలంలో బోరు తవ్వించాడు. రెండు రోజుల నుంచి బోరు నుంచి బంగారు రంగుతో కూడిన పొడి వస్తోంది. దీంతో బంగారం వస్తుందనే వార్త ఆ ప్రాంతంలో ప్రచారమైంది. శనివారం తహసీల్దార్‌ ఆదిత్య మిశ్రాతో పాటు పలువురు అధికారులు మట్టి నమూనా సేకరించి అనంతరం బోరును సీజ్‌ చేశారు. సేకరించిన మట్టి నమూనాను ల్యాబ్‌కు పంపించామని, పరీక్షలు జరిగాక ఇది బంగారమా లేదా వేరే ధాతువా అనే విషయం ఖరారవుతుందని తహసీల్దార్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు