పాము కాటేసినా.. పరీక్షకు హాజరైన విద్యార్థిని

పాము కాటేసినా.. వెరవకుండా ఆ బాలిక పరీక్ష రాసింది. ఒడిశాలోని కేంఝర్‌ జిల్లా దధిబబపూర్‌ గ్రామానికి చెందిన విద్యార్థి లిప్సా రాణి సాహు(17) ఆనందపూర్‌ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది.

Published : 26 Mar 2023 04:52 IST

కటక్‌, న్యూస్‌టుడే: పాము కాటేసినా.. వెరవకుండా ఆ బాలిక పరీక్ష రాసింది. ఒడిశాలోని కేంఝర్‌ జిల్లా దధిబబపూర్‌ గ్రామానికి చెందిన విద్యార్థి లిప్సా రాణి సాహు(17) ఆనందపూర్‌ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. శనివారం ఫైనల్‌ పరీక్ష రాసేందుకు ఇంటి నుంచి వెళ్తుండగా పాము కాటేసింది. వెంటనే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. ఆసుపత్రికి వెళ్దామని తల్లిదండ్రులు చెప్పినా.. పరీక్షలు రాయకపోతే ఏడాది కాలం వృథా అవుతుందని చెప్పి పరీక్షా కేంద్రానికే బయలుదేరింది. తండ్రి ఆమెను ద్విచక్ర వాహనంపై పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాడు. అక్కడ పరీక్ష రాస్తూ అస్వస్థతకు గురికావడంతో సిబ్బంది, తండ్రి కలసి ఆమెను ఆనందపూర్‌ సబ్‌ డివిజనల్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు