నేడు నింగిలోకి ఎల్‌వీఎం-3 వాహకనౌక
ఇస్రో మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలిస్తే తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఆదివారం ఉదయం 9.00.20 గంటలకు ఎల్‌వీఎం-3 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది.
కొనసాగుతున్న కౌంట్‌డౌన్
శ్రీహరికోట, న్యూస్‌టుడే: ఇస్రో మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలిస్తే తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఆదివారం ఉదయం 9.00.20 గంటలకు ఎల్‌వీఎం-3 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ ప్రక్రియ 24.30 గంటల పాటు కొనసాగనుంది. ఎల్‌వీఎం-3 వాహకనౌక ద్వారా వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ రెండు దశల్లో 72 ఉపగ్రహాలను ప్రయోగించడానికి వన్‌వెబ్‌తో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా మొదటి 36 ఉపగ్రహాలను గతేడాది అక్టోబరు 23న ఇస్రో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. తాజాగా రెండో విడత 36 ఉపగ్రహాలను పంపేందుకు రంగం సిద్ధమైంది.
అమ్మవారిని దర్శించుకున్న ఇస్రో అధిపతి: ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ శనివారం సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని మొక్కుకున్నారు. ఆయనకు ధర్మకర్తల మండలి ఛైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Odisha train tragedy: నెత్తుటి పట్టాలపై.. నలిగిపోయిన ‘ప్రేమ గీతాలు’!
-
India News
Odisha Train Accident: ఒడిశా విషాదం.. టికెట్ లేని వారికీ పరిహారం!
-
Sports News
WTC Final: ఫామ్‌పై ఆందోళన అవసరం లేదు.. కానీ, ఆ ఒక్కటే కీలకం: వెంగ్‌సర్కార్
-
Movies News
‘ది ఫ్యామిలీ మ్యాన్’.. కెరీర్ ఎందుకు నాశనం చేసుకుంటున్నావని నా భార్య అడిగింది: మనోజ్
-
Sports News
Virat Kohli: ‘మిడిల్ ఆర్డర్‌కు వెన్నెముక.. ఎల్లప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉంటాడు’
-
Movies News
Social Look: శ్రీలంకలో మృణాళిని రవి సెల్ఫీ.. విష్ణుప్రియ ‘ఎల్లో’ డ్రెస్సు