Kerala: మహిళల వేషధారణలో పురుషుల పూజలు

కేరళలోని కొల్లం జిల్లాలో చమయవిళక్కు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వందల సంఖ్యలో పురుషులు మహిళల వేషధారణలో వచ్చి శ్రీ కొట్టంకులంగర దుర్గ భగవతి ఆలయంలో దీపార్చన చేశారు.

Updated : 26 Mar 2023 08:31 IST

కేరళలోని కొల్లం జిల్లాలో చమయవిళక్కు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వందల సంఖ్యలో పురుషులు మహిళల వేషధారణలో వచ్చి శ్రీ కొట్టంకులంగర దుర్గ భగవతి ఆలయంలో దీపార్చన చేశారు. పురుషులు.. మహిళల వేషధారణలో వచ్చి ఇక్కడ పూజలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. వారు ఐదు ఒత్తులు కలిగిన ప్రత్యేక దీపాలు వెలిగించి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. రెండు రోజుల పాటు జరిగే చమయవిళక్కు ఉత్సవాల్లో ట్రాన్స్‌జెండర్లు కూడా భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు